బాబు గురించి ఈ సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి: విజయసాయిరెడ్డి
- అధికారం కోల్పోయినా పరివర్తన రాలేదు
- నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకురావడం బాబుకే చెల్లింది
- ప్రభుత్వ పొరపాట్లను ప్రతిపక్షం ఎత్తిచూపాల్సి ఉంటుంది
- కానీ తనే ఆత్మరక్షణ ధోరణిలో పడటం విస్మయం కలిగిస్తోంది
వైసీపీ నేతల భూ దందాలు, అక్రమాలు, మాఫియాల ఆగడాలు, 108 అంబులెన్సుల కుంభకోణం వంటివి బయటికి రాకుండా చేయాలని టీడీపీ నాయకుల్ని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటోందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
'అధికారం కోల్పోయినా, పరివర్తన లేకుండా కుంభకోణాలు, నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకురావడం బాబుకే చెల్లింది. ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం తనే ఆత్మరక్షణ ధోరణిలో పడటం విస్మయం కలిగిస్తోంది. తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.