మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

  • రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు
  • కదిలిపోయిన భవనాలు
  • మెక్సికో, మధ్య అమెరికా ప్రాంతాలకు సునామీ హెచ్చరిక
మెక్సికోలో నిన్న 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:29 గంటలకు సంభవించిన ఈ భూకంపానికి ప్రజలు వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో పలు భవనాలు కంపించాయి. భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రుల నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని, ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికోతోపాటు మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. కాగా, మెక్సిలో మూడేళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపంలో 355 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


More Telugu News