నిరుద్యోగులకు స్టేట్‌బ్యాంకు శుభవార్త.. ఎలాంటి పరీక్షలు లేకుండానే 444 పోస్టుల భర్తీ

  • స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • జులై 13లోగా స్టేట్ బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
  • షార్ట్ లిస్ట్ అనంతరం వంద మార్కులకు ముఖాముఖి
ఎలాంటి పరీక్షలు లేకుండానే 444 స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టుల భర్తీకి భారతీయ స్టేట్‌బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్‌బీఐ ఆసక్తిగల అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ ద్వారా వచ్చే నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ రెజ్యూమ్, వయసు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష రాయాల్సిన పని లేదని అధికారులు పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వంద మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులను బట్టి ఉద్యోగం ఆఫర్ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూలో కటాఫ్ మార్కులు ఏ ఇద్దరికైనా ఒకేలా వస్తే వయసు ఆధారంగా ఎంపిక చేస్తామని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.


More Telugu News