సుశాంత్ ది ఆత్మహత్యే... పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ విడుదల!

  • ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవు
  • మెడకు ఉరి బిగుసుకుని మరణం
  • ఐదుగురు డాక్టర్ల సంతకాలతో ఫైనల్ రిపోర్టు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఆత్మహత్య చేసుకునే మరణించారని, ఆయన శరీరంపై అనుమానాస్పద స్థితిలో ఏ విధమైన గాయాలూ లేవని పోస్టుమార్టం ఫైనల్ రిపోర్ట్ వెల్లడించింది. మెడకు ఉరి బిగించుకోవడంతో అది బిగుసుకుని, ఉక్కిరిబిక్కిరై సుశాంత్ మరణించాడని వైద్య నివేదిక తెలిపింది. ఊపిరి ఆడకపోవడమే అతని మరణానికి కారణమంటూ, ఇది ఆత్మహత్యేనని ఐదుగురు వైద్యాధికారులు సంతకాలు చేశారు. కాగా, ఇదే సమయంలో సుశాంత్ కేసులో ఫోరెన్సిక్ ప్రక్రియను వేగంగా ముగించాలని బాంద్రా పోలీసులు, ఫోరెన్సిక్ డైరెక్టరేట్ కు ఓ లేఖ రాశారు. ఈ కేసులో ఇప్పటికే 23 మంది స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసిన పోలీసులు, సుశాంత్ నివసించే భవంతి నుంచి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు కూడా.


More Telugu News