విజయవాడ పున్నమి ఘాట్ లో 'షాక్'... గోవుల మరణంతో కలకలం!
- వర్షం, గాలితో తెగిపడ్డ విద్యుత్ తీగలు
- వాటిని తాకి మూడు ఆవుల మృతి
- అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న స్థానికులు
ఈ ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ లో మరణించిన గోవులు కనిపించడంతో కలకలం రేగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతోనే గోవులు మరణించాయని అధికారులు వెల్లడించారు. వర్షాలు, గాలి కారణంగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, వాటిని ఎవరూ గమనించలేదని, వాటిని తాకినందునే ఆవులు చనిపోయాయని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.