బిగ్ బాస్ 4లో బిత్తిరి సత్తి.. బయటకు వస్తున్న ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు!
- ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్
- వర్షిణి, తరుణ్ పాల్గొనబోతున్నారని ఇప్పటికే ప్రచారం
- టీవీ9కి బిత్తిరి సత్తి రాజీనామా చేసినట్టు వార్తలు
తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో... నాలుగో సీజన్ కు సిద్ధమవుతోంది. కొత్త సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వర్షిణి, తరుణ్, అఖిల్ సర్తాక్ లు ఈ షోలో పాల్గొనబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
తాజాగా మరోపేరు బయటకు వచ్చింది. తీన్మార్, ఇస్మార్ట్ న్యూస్ వంటి టీవీ షోలతో పాప్యులారిటీని సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి ఈ షోలో పాల్గొనబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బిత్తిరి సత్తితో షో నిర్వాహకులు ఇప్పటికే చర్చలు జరిపారని సమాచారం. ఈ షోలో పాల్గొనడం కోసమే టీవీ9కు ఆయన రాజీనామా చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ లో బిత్తిరి సత్తి పాల్గొనడంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.