సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • షూటింగులో పాల్గొన్న కాజల్ అగర్వాల్ 
  • చరణ్ కి కథ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్
  • ఓటీటీ ద్వారా సుశాంత్ చివరి చిత్రం  
*  లాక్ డౌన్ తర్వాత సుమారు మూడు నెలల పాటు ఖాళీగా వున్న కథానాయిక కాజల్ అగర్వాల్ తాజాగా షూటింగులో పాల్గొంది. అయితే, ఇదేదో సినిమా షూటింగ్ కాదు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ ఇది. ముంబైలోని ఓ స్టూడియోలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ షూటింగును నిర్వహించారు.
*  త్వరలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ లాక్ డౌన్ సమయంలో మరో సినిమాకి కూడా కథను సిద్ధం చేశాడట. దీనిని రామ్ చరణ్ కు వినిపించాడనీ, ఆయన ఓకే చెప్పాడనీ సమాచారం. వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుంది.  
*  ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను పొందిన డిస్నీ హాట్ స్టార్ దీనిని జూలై 24 నుంచి అందుబాటులో ఉంచుతుంది. థియేటర్స్ మూతబడిన కారణంగా ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.


More Telugu News