ఎందుకయ్యా లోకేశ్, మీ ఆవిడను కూడా ఈ గొడవలోకి లాగుతావ్!: విజయసాయిరెడ్డి

  • లోకేశ్ పై విజయసాయి విమర్శల దాడి
  • చేతగాని మాటలు అంటూ వ్యంగ్యం
  • మాలోకం కళ్లన్నీ ఇసుకమీదే అంటూ మరో ట్వీట్
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. 'లోకేశ్, సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ గారి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నావు. అవునా, తీసుకుంటున్నావా? ఎందుకయ్యా లోకేశ్, రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్!' అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.

అంతకుముందు చేసిన మరో ట్వీట్ లో, మాలోకం కళ్లన్నీ ఇసుక మీదే ఉంటాయని విమర్శించారు. నాడు ఇసుక మాఫియా నుంచి ప్రతి నెలా మామూళ్లు అందుకునేవాడని, ఇప్పుడా ఆదాయం పోయిందని ఏడుపు అంటూ ధ్వజమెత్తారు. హైదరాబాదులో కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వడం కాదని, ఇక్కడికొచ్చి సమస్యను అధ్యయనం చేసి మాట్లాడాలని హితవు పలికారు. ఎక్కడో ఒక ఘటనను చూపి, ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టినాయుడూ! అంటూ విజయసాయి వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News