కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ వైఖరికి ఇది పరాకాష్ట: రేవంత్ రెడ్డి

  • ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరోనా బాధితుడి మృతి
  • సెల్ఫీ వీడియోలో ఆవేదన
  • ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ అనే కరోనా బాధితుడు విషాదకర పరిస్థితుల నడుమ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం చేశాయంటూ తన పరిస్థితిని తండ్రికి సెల్ఫీ వీడియో ద్వారా వివరించిన రవికుమార్ మృత్యువుకు బలయ్యాడు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దీనిపై ట్వీట్ చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ బాధ్యతా రాహిత్య వైఖరికి పరాకాష్ట అని పేర్కొన్నారు. తన ట్వీట్ కు తెలంగాణ సీఎంఓ, తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ లను ట్యాగ్ చేశారు. అంతేకాదు, రవికుమార్ సెల్ఫీ వీడియోను కూడా రేవంత్ రెడ్డి పంచుకున్నారు.



More Telugu News