అందంగా లేనని ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి!

  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • ముఖంపై మచ్చలు ఉండడంతో బాధపడిన విద్యార్థి
  • అందవిహీనంగా కనపడుతున్నానని ఆత్మన్యూనత భావం
  • వైద్యులను సంప్రదించినా ఫలితం లేదని మనస్తాపం
అందంగా లేనని చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాడు. తన ముఖంపై మచ్చలు ఉండడంతో అందరూ తనను ఇష్టపడడం లేదని భావించేవాడు. ఆత్మన్యూనత భావంతోనే పెరిగిన ఆ యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురంలో చోటు చేసుకుంది.  

డిగ్రీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ (20) ముఖంపై చిన్నప్పటి నుంచి మచ్చలు ఉండేవి. అందవిహీనంగా కనపడుతున్నానని ప్రతి రోజు బాధపడేవాడు. చాలా క్రీములు వాడాడు.. వైద్యులను సంప్రదించాడు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో కుంగిపోయాడు.

కాలేజీకి వెళ్లే సమయంలో ముఖంపై కర్చీఫ్‌ కప్పుకునే వెళ్లేవాడు. తాను అందంగా లేకపోవడంతో భవిష్యత్తులోనూ తననందరూ చులకనగా చూస్తారని భావించాడు. ఈ బాధతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు.. సోంపేట ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. నేడు కరోనా పరీక్ష చేసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.


More Telugu News