నా వియ్యంకుడు సాయిధరమ్ తేజ్ కు థ్యాంక్స్: మంచు మనోజ్ చమత్కారం
- పెంపుడు కుక్కలకు డేటింగ్ ఏర్పాటు చేసిన మనోజ్, సాయిధరమ్ తేజ్
- టాంగో, జోయాలకు డేటింగ్ రోజు అంటూ మనోజ్ ట్వీట్
- త్వరలోనే శుభలేఖలు వేయిస్తాం అంటూ చమత్కారం
టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ స్నేహశీలి అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగాహీరోలతో బాగా క్లోజ్ గా ఉండే మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు చేశాడు. సాయిధరమ్ తేజ్ ను తన వియ్యంకుడిగా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు. అందుకు కారణం ఉంది. సాయిధరమ్ తేజ్ సహకారంతో మనోజ్ తన పెంపుడు శునకానికి డేటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించాడు.
"టాంగో, జోయాలకు ఇది డేటింగ్ రోజు. భౌతికదూరం నియమం కచ్చితంగా పాటించాం. నాకు మంచి అల్లుడ్ని ఇస్తున్నందుకు నా వియ్యంకుడు సాయిధరమ్ తేజ్ కు థ్యాంక్స్. త్వరలోనే ముహుర్తాలు పెట్టించి శుభలేఖలు వేయిస్తాం" అంటూ చమత్కరించాడు. అంతేకాదు, తమ పెంపుడు కుక్కలతో ఉన్న తామిద్దరి ఫొటోను కూడా మంచు మనోజ్ పంచుకున్నాడు.