పాకిస్థాన్ పేరును 'పాకియతాన్'గా మార్చేసిన పీసీబీ... ఏకిపారేస్తున్న నెటిజన్లు!

  • ఇంగ్లండ్ లో కాలుమోపిన పాకిస్థాన్ జట్టు
  • ఆల్ ది బెస్ట్ చెబుతూ పాకియతాన్ అని సంబోధన
  • గంట తరువాత తప్పు తెలుసుకున్న పీసీబీ
  • అప్పటికే స్క్రీన్ షాట్స్ వైరల్
క్రికెట్ సందడి తిరిగి మొదలు కానుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ లో కాలుపెట్టింది. ఈ నేపథ్యంలో పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఓ ట్వీట్ చేసి, నెటిజన్లతో నానా తిట్లూ తిట్టించుకుంది. తన ట్వీట్ లో దేశం పేరును తప్పుగా రాయడమే ఇందుకు కారణం. 'పాకిస్థాన్' పేరును 'పాకియతాన్' అంటూ సంబోధించింది.

ఇంగ్లండ్ బయలుదేరుతున్న తమ జట్టుకు అభినందనలు తెలుపుతూ, "పాకియతాన్ జట్టు ఇంగ్లండ్ కు బయలుదేరింది. ఆల్ ది బెస్ట్ బాయ్స్" అంటూ ట్వీట్ చేస్తూ, ఎయిర్ పోర్టులో, విమానంలో ఇంగ్లండ్ క్రికెటర్లు ఉన్న చిత్రాలను పోస్ట్ చేసింది. సొంత దేశం పేరునే తప్పుగా రాయడంతో ఆ దేశ వాసులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పాకియతాన్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సెటైర్ల మీద సెటైర్లు వేశారు. నిమిషాల్లోనే ఎన్నో ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఓ గంట తరువాత పీసీబీ తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్నా, అప్పటికే ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. 


More Telugu News