ముంబైకి బై చెప్పి.. వెళ్లిపోయిన బాలీవుడ్ హీరోయిన్ సంజనా సాంఘి!
- 'దిల్ బేచారా'లో సుశాంత్ పక్కన హీరోయిన్ గా సంజన
- సహ నటుడి మరణంతో నిరాశ
- వేదాంత ధోరణితో పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం 'దిల్ బేచారా' హీరోయిన్ సంజనా సాంఘి ప్రస్తుతం తీవ్ర ఉద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధం కావడంతో, వెండి తెరపై తాను తొలిసారి హీరోయిన్ గా కనిపించే చాన్స్ పోయినట్లయింది. ఇదే సమయంలో సహ నటుడి మరణం ఆమెలో నిరాశను నింపిందేమో, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆమె వేదాంత ధోరణితో ఓ పోస్టు పెట్టింది.
"బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, కొత్తగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో నిండుకున్న బాధ కారణంతో నా చూపు కూడా మారిందేమో... వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కాకుంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు కూడా" అంటూ ఓ భావోద్వేగ పోస్ట్ ను పెడుతూ, తన మనసులోని భావాలను ఆమె పంచుకుంది.
2011లో రణ్ బీర్ కపూర్, నర్గిస్ ఫక్రీ నటించిర 'రాక్ స్టార్'లో సహనటి పాత్ర ద్వారా సంజనా సాంఘి బాలీవుడ్ లో కాలుమోపింది. ఆమె తాజా చిత్రం 'దిల్ బేచారా', ఈ నెల 24న ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కానుంది.