పెళ్లయిన తొలి ఆరు నెలల్లో భర్తతో గడిపింది 21 రోజులు మాత్రమే... అనుష్క శర్మ!

  • నేను ఖాళీగా ఉంటే కోహ్లీ బిజీ
  • కోహ్లీకి విశ్రాంతి దొరికితే నేను షూటింగ్ లో
  • భోజనం కోసమే కలిసిన సందర్భాలున్నాయన్న అనుష్క
సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జంట, తమ వివాహమైన ఆరు నెలల వ్యవధిలో కలిసున్నది కేవలం 21 రోజులు మాత్రమేనట. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా వెల్లడించింది. తాను ఖాళీగా ఉన్న సమయంలో కోహ్లీ షెడ్యూల్ బిజీగా ఉండటం, కోహ్లీకి విశ్రాంతి దొరికిన వేళ, తాను షూటింగ్స్ అంటూ పరిగెడుతుండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పింది.

తాజాగా 'వోగ్' మ్యాగజైన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, విరాట్, తాను కలిసి కనిపించిన ప్రతిసారీ, అది తమ విహార యాత్ర ఏమీ కాదని, కలిసి భోజనం చేసేందుకు బయటకు వెళుతూ ఉండేవాళ్లమని చెప్పింది. పలుమార్లు కేవలం భోజనం చేసేందుకు విదేశాల్లో కలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.

"నిజం చెప్పాలంటే, పెళ్లి తరువాత తొలి ఆరు నెలల కాలంలో కేవలం 21 రోజులు మాత్రమే మేము కలసిగడిపాము. అవును, నేను రోజులు లెక్క పెట్టాను. ఆ సమయమే నాకెంతో విలువైనదిగా అనిపించేది" అని అనుష్క వ్యాఖ్యానించింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మరింత సమయాన్ని గడుపుతున్నామని వెల్లడించిన ఆమె, తమది జన్మజన్మల అనుబంధమని అనిపిస్తూ ఉంటుందని వ్యాఖ్యానించింది.


More Telugu News