నితీశ్ కుమార్ మేనకోడలికి కరోనా పాజిటివ్
- పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు
- నితీశ్ నివాసాన్ని శానిటైజ్ చేయించిన వైనం
- కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అధికారులు
దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా అందరినీ తాకుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడ్డారు. పలువురు ప్రాణాలను కూడా కోల్పోయారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మేనకోడలికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆమెను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, నితీశ్ నివాసాన్ని శానిటైజ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
బీహార్ శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో నితీశ్ కుమార్ పక్కన మండలి చైర్మన్ అవధేశ్ నారాయణసింగ్ కూర్చున్నారు. ఆ తర్వాత నారాయణసింగ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో నితీశ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.