వైఎస్ఆర్ సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
- పిటిషన్ వేసిన అన్నా వైయస్ఆర్ పార్టీ నేత బాషా
- యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుకు బదులుగా తమ పేరు వాడుతున్నారని ఆరోపణ
- ఇదే విషయంపై ఇటీవల నిలదీసిన రఘురాజు
ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను అన్నా వైయస్ఆర్ పార్టీ నేత బాషా దాఖలు చేశారు. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి బదులుగా వైయస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఇదే పేరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వైయస్ఆర్సీపీ పేరుపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ పేరుతో తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.