హోమ్ క్వారంటైన్ కు వెళ్లిన 'రేసుగుర్రం' మద్దాలి శివారెడ్డి!
- రవికిషన్ పీఏకు కరోనా పాజిటివ్
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రవికిషన్
- అందరూ మాస్కులు ధరించాలని విన్నపం
అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో నాయకుడి పాత్రకు దీటుగా ఉండే విలన్ 'మద్దాలి శివారెడ్డి' పాత్రను భోజ్ పురి స్టార్ రవికిషన్ పోషించారు. ఆ తర్వాత దక్షిణాదిన టాప్ విలన్లలో ఒకరిగా ఆయన దూసుకుపోతున్నారు. మరోవైపు, బీజేపీ ఎంపీగా కూడా ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన ఇంట్లో కూడా కరోనా కలకలం రేపింది.
తన పీఏ గుడ్డూ పాండే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని... పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలిందని రవికిషన్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తన పీఏ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. మరోవైపు, పీఏకు కరోనా పాజిటివ్ అని తెలియగానే రవికిషన్ హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు.