వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న రష్యా... డబ్ల్యూహెచ్ఓ రూల్స్ ప్రకారం అదింకా ఫేజ్-1లోనే!
- రష్యాలో వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు
- పురోగతి సాధించామన్న గమాలెయ్ పరిశోధక సంస్థ
- ఆగస్టు 14 నాటికి వ్యాక్సిన్ వస్తుందంటున్న సంస్థ డైరెక్టర్
- వ్యాక్సిన్ రావాలంటే మూడు దశలు తప్పనిసరి అంటున్న డబ్ల్యూహెచ్ఓ
రష్యాకు చెందిన గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీలో తాము ఎంతో పురోగతి సాధించినట్టు చెబుతోంది. ఇప్పటికే సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, వలంటీర్లకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చామని అంటోంది. తాజాగా, ఈ గమాలెయ్ సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ మాట్లాడుతూ, తమ వ్యాక్సిన్ ఆగస్టు 14 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని, సెప్టెంబరు నుంచి ఫార్మా కంపెనీల్లో భారీగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరిశోధనలను సమన్వయం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం చూస్తే, రష్యా వ్యాక్సిన్ ఇంకా క్లినికల్స్ ట్రయల్స్ లో మొదటి దశ (ఫేజ్-1)లోనే ఉందని తెలుస్తోంది. ఏ వ్యాక్సిన్ అయినా భారీస్థాయిలో ఉత్పత్తికి అనుమతి పొందాలంటే అది మానవులపై క్లినికల్ ట్రయల్స్ లో మూడు దశలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే రష్యా వ్యాక్సిన్ అన్ని దశలు పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుంది.