కరోనా బారినపడడం తప్పేమీ కాదు: రాజమౌళి
- కరోనా చికిత్సలో ప్లాస్మాకు పెరుగుతున్న ప్రాధాన్యత
- ప్లాస్మా దానం చేయాలంటూ రాజమౌళి పిలుపు
- ఇతరుల ప్రాణాలు కాపాడాలంటూ ట్వీట్
కరోనా వైరస్ బారినపడిన వాళ్లకు ప్లాస్మా చికిత్స చేస్తే త్వరగా కోలుకుంటారన్న నేపథ్యంలో టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి స్పందించారు. మీరు కరోనా నుంచి కోలుకున్నారా... అయితే అవసరంలో ఉన్న ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు రండి, ప్లాస్మా దానం చేయండి అంటూ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా బారినపడడం తప్పేమీ కాదని, ఇదొక సామాజిక కళంకం అని భావించి వెనుకడుగు వేయకుండా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమవంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దాతగా మీ పేర్లను ఇక్కడ నమోదు చేసుకోవాలంటూ గివ్ రెడ్ డాట్ ఇన్ (givered.in) అనే స్వచ్ఛంద సంస్థ వెబ్ సైట్ ను కూడా తన ట్వీట్ లో పొందుపరిచారు.