మరో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
- జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా సాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
- నాగ్‌నాడ్‌లో ఈ ఉదయం ఎన్‌కౌంటర్
- ఈ ఏడాది ఇప్పటి వరకు 131 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత ఏడాది కాలంగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుండగా, గత నెల రోజులుగా సైన్యం మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా, కుల్గాం జిల్లాలోని నాగ్‌నాడ్ చిమ్మర్ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నాగ్‌నాడ్‌లో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 131 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.