ఓ పార్టీ ఎమ్మెల్యేలను అమ్ముకుంటుంటే.. మరో పార్టీ కొంటోంది: 'ఆప్' నేత

  • కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది.. అది బతకడం కష్టమే
  • రాజస్థాన్‌ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు
  • ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలా?
కాంగ్రెస్ పార్టీపై 'ఆప్' జాతీయ అధికార ప్రతినిధి, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే వారిని గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తమకు సాయం చేసే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే ఓ పార్టీ తమ ఎమ్మెల్యేలను అమ్ముకుంటుంటే, మరో పార్టీ వారిని కొనుగోలు చేస్తోందంటూ కాంగ్రెస్, బీజేపీలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్‌లో ఏం జరుగుతోందో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని రాఘవ్ చద్దా అన్నారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, ప్రస్తుతం ఆ పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. అది బతికి బట్టకట్టడం అసాధ్యమని తేల్చి చెప్పారు. తనకే భవిష్యత్‌ లేని ఆ పార్టీ దేశానికి ఇంకేమి చేస్తుందని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే దేశానికి ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు.


More Telugu News