మీ వద్దకు వచ్చే బిల్లులను నిశితంగా పరిశీలించండి: గవర్నర్ కు యనమల విజ్ఞప్తి

  • వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు ఆమోదించవద్దని వినతి
  • అవసరమైతే అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని విజ్ఞప్తి
  • గవర్నర్ కు లేఖ రాసిన యనమల
రాజ్యాంగం ప్రకారం సంఘర్షణకు దారితీసే బిల్లులను ఆమోదించవద్దని, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రజాప్రయోజనాల ప్రాతిపదికన పరిశీలించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు విజ్ఞప్తి చేశారు. వైసీపీ సర్కారు తీసుకువచ్చిన ఈ బిల్లులు రెండు 2014లో పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.

ఆ రెండు బిల్లులను ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో రెండోసారి ప్రవేశపెట్టినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోలేదని యనమల వివరించారు. ఆ బిల్లులు ఇప్పటికీ సెలెక్ట్ కమిటీ వద్దే ఉన్నాయి... అందుకే, మీ వద్దకు వచ్చే బిల్లులను మీరు నిశితంగా పరిశీలించాలి అంటూ గవర్నర్ ను కోరారు. ఈ విషయంలో అవసరమైతే అటార్నీ జనరల్ అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గవర్నర్ కు యనమల లేఖ రాశారు.


More Telugu News