కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది: విజయసాయిరెడ్డి

  • రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు
  • పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు
  • ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?
  • ఓహో ఇదంతా నీ పచ్చ స్వామిపై భక్తా?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి కన్నా లేఖ రాయడం పట్ల ఆయన అభ్యంతరాలు తెలిపారు.

 'కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?' అని విమర్శించారు.

'బాబుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బీజేపీని జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు. కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇన్‌చార్జీ కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామిపై భక్తా?' అని విజయసాయిరెడ్డి నిలదీశారు.


More Telugu News