5 కోట్ల మంది ప్రజలు మీ ఆఫీసు వైపు చూస్తున్నారు న్యాయం చేయండి గవర్నర్ గారు: దేవినేని ఉమ
- మూడు రాజధానుల బిల్లుపై దేవినేని వ్యాఖ్యలు
- వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు
- పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకే రాజధాని అని ఉంది
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపిన నేపథ్యంలో ఆయనకు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఓ విజ్ఞప్తి చేశారు. 216 రోజులుగా రాష్ట్రంలో ప్రజలు ధర్నాలు చేస్తున్నారని, 68 మంది రాజధానికోసం బలిదానం చేశారని ఆయన చెప్పారు.
'పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని ప్రభుత్వమే కోర్టులో చెప్పింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకే రాజధాని అని ఉంది. 68 మంది అమరులైనా, కరోనా వ్యాప్తి సమయంలోనూ 216 రోజులుగా ఉద్యమిస్తున్న 5 కోట్ల మంది ప్రజలు మీ కార్యాలయంవైపు చూస్తున్నారు న్యాయం చేయండి ఏపీ గవర్నర్ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.