ఏపీలో ఒక్క రోజులోనే 7,998 కేసులు: దేవినేని ఉమ విమర్శలు

  • ఒక్కరోజులో 61 మరణాలు
  • కరోనా తాండవం చేస్తుంది
  • కరోనా పరీక్షల ధరలు పెరిగిపోయాయి
  • ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?
ఆంధప్రదేశ్‌లో కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం పట్ల టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'ఒక్క రోజులోనే 7,998 కేసులు, 61 మరణాలు. కరోనా తాండవం చేస్తుంది. కరోనా పరీక్షల ధరలు పెరిగిపోయాయి. కరోనా పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య పెంచాలి. బాధితుల పట్ల వివక్ష చూపకుండా అవగాహన పెంచేందుకు, కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు  ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

కాగా, రోజువారీ కేసుల నమోదులో జాతీయ స్థాయిలో ఏపీ రెండో స్థానానికి చేరింది. తూర్పు గోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News