ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కేటీఆర్.. ఆరు అంబులెన్సుల అందజేత
- సొంత డబ్బుతో ఆరు అంబులెన్సులు సాయం
- ఇటీవల పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ హామీ
- ఆయన బాటలో పలువురు టీఆర్‌ఎస్ నేతలు
తన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్సులను అందజేస్తానని స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆరు అంబులెన్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చును భరిస్తానని, వాటిని టీఆర్‌ఎస్ పార్టీ తరఫున వాటిని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట మేరకు కేటీఆర్ ఈ రోజు ఆరు అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. వాటిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
ఇందులో కేటీఆర్ భార్య శైలిమ, కూతురు అలేఖ్య కూడా పాల్గొన్నారు. కాగా, కేటీఆర్ బాటలోనే మరికొంతమంది మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు పయనిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అంబులెన్సులు అందించేందుకు సాయం అందించారు. మొత్తం 100 అంబులెన్సులను సమకూర్చేలా టీఆర్‌ఎస్ ప్రణాళిక వేసుకుంది.