ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారి కోసం ఆటోమేటిక్ ఈ-పాస్

  • నిబంధనలు సడలించిన ఏపీ ప్రభుత్వం
  • స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేస్తే వెంటనే ఈ-పాస్
  • రేపటి నుంచి ఈ-పాస్ ల జారీ
ప్రస్తుతం దేశంలో అన్ లాక్-3 ప్రక్రియ నడుస్తోంది. కరోనా వ్యాప్తి కోసం విధించిన లాక్ డౌన్ ను విడతల వారీగా సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం నిబంధనలు సడలించింది.

ఇకపై, ఎవరైనా రాష్ట్రానికి రావాలనుకుంటే స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ అవుతుంది. పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసిన వెంటనే మొబైల్ నెంబర్ కు, ఈమెయిల్ కు ఈ-పాస్ వస్తుంది. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ-పాస్ తో పాటు గుర్తింపు కార్డును  చూపిస్తే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ-పాస్ ల జారీ రేపటి నుంచి అమల్లోకి రానుంది.


More Telugu News