మీరు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని పాఠ్యాంశంగా విద్యాలయాల్లో బోధిస్తారు: వర్ల రామయ్య
- అవగాహనారాహిత్యంతో రాజధానిని తరలిస్తున్నారు
- చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు
- భావితరాలు మిమ్ము క్షమించవు
- ఆత్మ పరిశీలన చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ నేతల నుంచి విమర్శల జల్లు కురుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేగాక, సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన ఆమోదించడంతో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. జగన్ చారిత్రక తప్పిదం చేశారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.
'ముఖ్యమంత్రి గారూ! మీ అవగాహనా రాహిత్యంతో అమరావతిని తరలించి చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు. భావితరాలు మిమ్ము క్షమించవు. మీరు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని పాఠ్యాంశంగా విద్యాలయాల్లో బోధిస్తారు. ఆత్మ పరిశీలన చేసుకొని నిర్ణయం వెనక్కు తీసుకోoడి. కక్ష్య రాజకీయాలు మంచివి కావు' అని వర్ల రామయ్య విమర్శించారు.