కమెడియన్ పృథ్వీరాజ్ కు తీవ్ర జ్వరం... ఆసుపత్రిలో చేరిక.. మీ ఆశీస్సులు కావాలంటూ వీడియో

  • నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిక
  • గత కొన్నిరోజులుగా తీవ్ర జ్వరం
  • కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందన్న పృథ్వీ
  • సీటీ స్కానింగ్ తర్వాత వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరిక
టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. మీ ఆశీస్సులు కావాలంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత కొన్నిరోజులుగా తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, పలుచోట్ల వైద్య పరీక్షలు చేయిస్తే కరోనా నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.  సీటీ స్కానింగ్ కూడా తీయించానని, అయితే డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుని, నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వరస్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతుడ్ని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీ తన వీడియోలో తెలిపారు.



More Telugu News