కరోనాకు టీకా హైదరాబాద్ నుంచే వస్తుంది: కేటీఆర్
- నేడు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను సందర్శించిన కేటీఆర్
- భారత్ బయోటెక్ నుంచి తొలి టీకా వస్తుందని చెప్పిన కేటీఆర్
- ప్రపంచంలో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగింది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు టీకా హైదరాబాద్ నుంచే వస్తుందని... అది కూడా భారత్ బయోటెక్ నుంచే వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీకాల అభివృద్ధి, తయారీలో భారతదేశ భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని ప్రపంచ దేశాలు పదేపదే చెపుతున్నాయని... ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు.
ప్రపంచ దేశాలకు మూడో వంతు వ్యాక్సిన్ ను హైదరాబాద్ నుంచి అందిస్తున్నామని... ఇది మనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా ఉన్నారు.