కరోనాను జయించిన సుమలత... ఎవరికైనా సందేహాలుంటే లైవ్ చాట్ లో అడగాలని సూచన
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సుమలత
- కరోనాను ఎలా ఎదుర్కొన్నారంటూ ఆమెపై ప్రశ్నల వర్షం
- బుధవారం ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో వస్తానని వెల్లడి
ప్రముఖ నటి, లోక్ సభ సభ్యురాలు సుమలత ఇటీవలే కరోనాను జయించి పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారు. అయితే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నారంటూ తనను చాలామంది మిత్రులు, ఇతరులు అడుగుతున్నారని సుమలత వెల్లడించారు.
కరోనా చికిత్సలో మీరు ఎదుర్కొన్న అనుభవాలేంటి? మీ పోరాటం ఎలా సాగింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని, అలాంటివారందరి కోసం రేపు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొంటున్నట్టు వివరించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ చైత్ర సాయంతో అందరి సందేహాలు నివృత్తి చేస్తానని సుమలత వెల్లడించారు. తన కరోనా అనుభవాలు ఏ కొందరికైనా ఉపయోగపడితే అదే చాలని ఆమె తెలిపారు.