జగన్ గారూ.. ఈ ముగ్గురిని అడిగితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది: వర్ల రామయ్య

  • కరోనా బారిన పడిన పలువురు వైసీపీ నేతలు
  • హైదరాబాదులో కరోనా చికిత్స చేయించుకున్న వైనం
  • ఏపీలో కరోనా కట్టడి ఏర్పాట్లపై వర్ల విమర్శలు
కరోనా వైరస్ భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదుకు పారిపోయారని... రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించడం లేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరంతా ఏపీలో కాకుండా... హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ అంశం టీడీపీ నేతలకు మంచి అస్త్రంగా దొరికినట్టైంది. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వర్ల రామయ్య ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు.

'ముఖ్యమంత్రి గారూ! మన రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపట్టిన ఏర్పాట్లు ఎంత గొప్పగా వున్నాయో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా మన సహచరుడు శ్రీ విజయసాయిరెడ్డిని అడిగితే, వారే చెబుతారు. వీరంతా పక్క రాష్ట్రానికి వెళ్లి వైద్యం ఎందుకు చేయించుకున్నారో?' అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.


More Telugu News