ఒక హిందువుగా ఆ పని చేయలేను: యోగి ఆదిత్యనాథ్

  • సుప్రీం ఆదేశాల ప్రకారం అయోధ్యలో మసీదును నిర్మించాల్సి ఉంది
  • యోగి హాజరయ్యే అంశంపై జరుగుతున్న చర్చ
  • మసీదుకు వెళ్లలేనని స్పష్టం చేసిన యోగి
అయోధ్య రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదును కూడా నిర్మించాల్సి ఉంది. దీంతో, మసీదు ప్రారంభోత్సవానికి యూపీ సీఎం హోదాలో యోగి వెళ్తారా? లేదా? అనే అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తాజాగా యోగి స్పందించారు. తనకు ఆహ్వానం వచ్చినప్పటికీ తాను వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. ఒక హిందువుగా తాను వెళ్లలేనని చెప్పారు.

ముఖ్యమంత్రిగా మతాలతో తనకు ఎలాంటి సమస్య లేదని... కానీ, ఒక హిందువుగా మాత్రం ఆ పని చేయలేనని తెలిపారు. మసీదు నిర్మాణంలో తాను భాగస్వామిని కానని చెప్పారు. కొందరు నేతలు మాత్రం టోపీ పెట్టుకుని, ఇఫ్తార్ లకు వెళ్తూ, సెక్యులర్ అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.


More Telugu News