గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే జీవితంపై వెబ్ సిరీస్
- ఇటీవల ఎన్ కౌంటర్ లో హతుడైన వికాస్ దూబే
- బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వంలో వెబ్ సిరీస్
- అనుమతులు పొందిన నిర్మాత
ఇటీవలే యూపీ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో హతమైన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే జీవితంపై ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తారు. అయితే, ఇది నిజజీవిత గాథ కావడంతో దీన్ని తెరకెక్కించేందుకు నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అవసరమైన అనుమతులను పొందారు.
దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, అందుకే తాము తీయబోయే వెబ్ సిరీస్ అంత్యంత ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుత సమాజాన్ని చూపిస్తుందని వివరించారు. వికాస్ దూబే గ్యాంగ్ ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపడం ఓ సంచలనమైతే, కొన్నిరోజుల్లోనే వికాస్ దూబేను పట్టుకుని పోలీసులు తూటాకు తూటాతోనే సమాధానం చెప్పడం పెను సంచలనమైంది.