భర్త ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోనే గిద్దలూరు ఆర్ఐ సుశీల కూడా ఆత్మహత్య!
- సోమవారం నాడు కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య
- ఇద్దరు చిన్నారులను అనాధలుగా చేసి భార్య ఆత్మహత్య
- కేసును విచారిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న సుశీల ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త గుండా నారాయణరెడ్డి (34) సోమవారం నాడు బలవన్మరణానికి పాల్పడగా, ఆమె కూడా సూసైడ్ చేసుకున్నారు. వీరిద్దరికీ ఆరేళ్ల క్రితం వివాహం జరుగగా, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం భర్తతో గొడవ పడిన సుశీల, ఆపై తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్న భోజన విరామంలో ఇంటికి వచ్చేసరికి భర్త సీలింగుకి వేలాడుతూ కనిపించాడు. ఆపై స్థానికుల సాయంతో భర్త మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి ఆటోలో ఆమె బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రాచర్ల వద్ద ఆటోను ఆపించి, నారాయణరెడ్డి మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సుశీల కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.