ఎన్నికల ముందు అలా చెప్పారు.. ఇప్పుడు ఇలా చెప్పారు: జగన్ వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ
- ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు
- ఒక్కో మహిళకు ఇస్తానంది రూ.1,80,000
- బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం
- చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా
ఏపీలో 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున అందించే వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం వైఎస్ జగన్ నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఎన్నికల ముందు జగన్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పోస్ట్ చేశారు.
'ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కో మహిళకు ఇస్తానంది రూ.1,80,000 అంటే రూ.1,05,000 ఎగనామం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం, అటకెక్కిన సంక్షేమం. స్వయం ఉపాధి, ఆదరణ ఊసేలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో రోడ్లు, హాస్టల్, సంక్షేమ భవనాల నిర్మాణం బంద్. చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా జగన్ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.