పీవోకేలో వైద్యవిద్య అభ్యసించిన వాళ్లు భారత్ లో డాక్టర్లు కాలేరు: కేంద్రం స్పష్టీకరణ

  • పీవోకేలోని కళాశాలకు భారత గుర్తింపు లేదన్న కేంద్రం
  • అక్కడి వైద్య డిగ్రీలు భారత్ లో చెల్లవని వెల్లడి
  • నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్య విద్యామండలి
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో వైద్య విద్య అభ్యసించిన వారు భారత్ లో డాక్టర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. కశ్మీర్ లో కొంత భాగం (పీవోకే) పాకిస్థాన్ అధీనంలో ఉందని, అందుకే అక్కడి వైద్య కళాశాలలకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం అనుమతులు ఇవ్వలేదని కేంద్రం వివరించింది. ఈ నేపథ్యంలో, పీవోకేలో వైద్య విద్య చదివినవాళ్లు భారత్ లో డాక్టర్లు కాలేరంటూ కేంద్ర వైద్య విద్యామండలి ప్రధాన కార్యదర్శి ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. పీవోకే డాక్టర్ డిగ్రీలు భారత్ లో చెల్లవని ఆ నోటిఫికేషన్ లో వెల్లడించారు.


More Telugu News