అలా చేయకపోతే ఈ ప్రభావం మీ మీద పడుతుంది ముఖ్యమంత్రి గారు: వర్ల రామయ్య

  • జస్టిస్ ఈశ్వరయ్య గారు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
  • రాజీనామా చేయవలసిన అవసరం ఉంది
  • మీరైనా ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించండి
  • రాబోవు రోజులు బహు గడ్డువి సుమీ
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య రాజీనామా చేయాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సస్పెన్షన్‌లో ఉన్న దళిత జడ్జి రామకృష్ణతో ఈశ్వరయ్య జరిపిన ఫోన్‌ సంభాషణ వివాదం ఇటీవల హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రలోభాలకు గురిచేసేలా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్ల రామయ్య స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  

'ముఖ్యమంత్రి గారూ.. నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే న్యాయ వ్యవస్థలో పనిచేసి, ప్రస్తుతం మీ మెప్పు పొంది, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ ఈశ్వరయ్య గారు రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రభావం మీ మీద పడుతుంది. మీరైనా ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించండి. రాబోవు రోజులు బహు గడ్డువి సుమీ!' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.



More Telugu News