రాజకీయాలు నా జీవితంలో ముగిసిన అధ్యాయం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- నా జీవితంలో ఇక రాజకీయాలకు చోటు లేదు
- ప్రతి ఒక్కరు మాతృభాషకు ప్రాధాన్యతను ఇవ్వాలి
- ఐదు రోజుల క్రితమే ఎస్పీ బాలుతో మాట్లాడాను
తన జీవితంలో ఇక రాజకీయాలకు స్థానం లేదని... అదొక ముగిసిన అధ్యాయమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం మన దేశం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చెప్పారు. త్వరలోనే పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు మాతృభాషకు ప్రాధాన్యతను ఇవ్వాలని... ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ కొంత సమయం దొరుకుతుందని, ఈ సమయంలో కొత్త భాషను నేర్చుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఐదు రోజుల క్రితమే బాలుతో మాట్లాడానని... నెల్లూరుపై పాట పాడాలని కోరానని చెప్పారు. వెన్నెలకంటితో పాట రాయించి పాడుతానని బాలు తనకు హామీ ఇచ్చారని తెలిపారు. తన కోరికను తీరుస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. మరోవైపు, బాలు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు.