ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు ఫాజియాపై హత్యాయత్నం
- సోదరితో కలిసి ప్రయాణిస్తుండగా దాడి
- కుడిచేతికి గాయం
- తమకు సంబంధం లేదన్న తాలిబన్
ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు ఫాజియా కూఫీపై శుక్రవారం రాజధాని కాబూల్ సమీపంలో దాడి జరిగింది. సోదరితో కలిసి ప్రయాణిస్తున్న ఆమెపై ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కూఫీ కుడిచేతికి గాయమైనట్టు అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాల్మే ఖలీల్జాద్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్-తాలిబన్ చర్చల్లో మహిళల తరపున కూఫీ పాల్గొనడంతో ఈ దాడి తాలిబన్ల పనే అయి ఉంటుందని భావించారు. అయితే, ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ ప్రకటించింది.