కమలా హారిస్ గెలుపుపై తమిళనాడులో పోస్టర్లు.. వాటిని పోస్ట్ చేసిన మేనకోడలు!
- అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
- ఆమె విజయం తథ్యం అంటూ తమిళనాడులో ఓ పోస్టర్
- కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్
- కమలా హారిస్ చిన్నప్పుడు తాతతో దిగిన ఫొటో కూడా పోస్ట్
భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె విజయం తథ్యం అంటూ తమిళనాడులో ఓ పోస్టర్ వెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కమలా హారిస్ మేనకోడలు, కాలిఫోర్నియాకు చెందిన న్యాయవాది మీనా హారిస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే, కమలా హారిస్ చిన్నప్పుడు తన తాతతో దిగిన ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
పీవీ గోపాలన్ మనవరాలు విజయం సాధించినట్లే అని కమలా హారిస్ పోస్టర్ కింద తమిళంలో రాసి ఉంది. తన చిన్నప్పుడు చెన్నైకి తమ కుటుంబంతో వెళ్లినప్పుడు తమ ముత్తాత గురించి తాను తెలుసుకునేదానినని ఆమె చెప్పింది. తన బామ్మకు ఆయన కొండంత అండగా ఉండేవారని తెలిపింది. కాగా, కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైకు చెందిన వ్యక్తన్న విషయం తెలిసిందే. ఆమె తండ్రి చెన్నైలో ప్రభుత్వాధికారిగా పనిచేశారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను ప్రకటించడంతో తమిళనాడులోని ఆమె బంధువులు సంతోషంలో మునిగిపోతున్నారు.