ఫోన్ టాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టడం నిజం కాదా?: బుద్ధా
- ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం
- మోదీకి లేఖ రాసిన చంద్రబాబు
- ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న వైసీపీ
- ఢిల్లీ ముఖ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారన్న బుద్ధా
ఫోన్ ట్యాపింగ్ అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందంటూ టీడీపీ గట్టిగా ఆరోపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా స్పందించారు. ఫోన్ టాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. తమను ఈ వ్యవహారం నుంచి బయటపడేయమని ఢిల్లీ పెద్దలకు ఫోన్లు చేసి ఎందుకు వేడుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.