మందు సీసాకు 'ప్రెసిడెంట్ మెడల్' పేరు పెట్టడం ఏంటి సార్?: వర్ల రామయ్య చురకలు

  • ఎక్సైజ్ శాఖ తీరు అధ్వానంగా ఉంది
  • అందరూ నవ్వుకుంటున్నారు
  • భవిష్యత్తులో దేవుండ్ల పేర్లు పెడతారని భయపడుతున్నారు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. మందు సీసాకు  'ప్రెసిడెంట్ మెడల్' అనే పేరు పెట్టిన తీరుని ఆయన విమర్శించారు. అలాగే,  పై వారి చేతిలో హోంమంత్రి పావుగా మారారని ఆయన విమర్శించారు.

'ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వంలో కొన్ని వ్యవస్థలు ఉచ్చ, నీచాలు తెలియకుండా వ్యవహరిస్తున్నవి. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ తీరు అధ్వానంగా ఉంది. మందు సీసాకు 'ప్రెసిడెంట్ మెడల్' పేరు పెట్టడం ఏంటి సార్? అన్యాయం. అందరూ నవ్వుకుంటున్నారు. భవిష్యత్తులో దేవుండ్ల పేర్లు పెడతారని భయపడుతున్నారు' అని ఎద్దేవా చేశారు.

'హోమ్ మంత్రి గారూ! ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రి అవడం చాలా గొప్ప. ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కూడా మీ బాధ్యత. పై వారి చేతిలో పావుగా మారి, వారి స్క్రిప్ట్ చదివి మీ విలువ తగ్గించుకోకండీ. మొన్న చంద్రబాబు,లోకేశ్ గురించి మీరు ప్రెస్ లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు మహిళాలోకం కూడ బాధపడింది' అని చెప్పారు. 


More Telugu News