దీనిపై నిన్న కేబినెట్లో చర్చించి ప్రజలకు ఎందుకు భరోసా కల్పించలేదు?: దేవినేని ఉమ
- నిన్న 9782 కేసులు, 86 మరణాలు
- కొంతమంది ప్రజా ప్రతినిధులకు పక్క రాష్ట్రాల్లో వైద్యం
- సామాన్య, మధ్యతరగతి వారికి కూడా మంచి వైద్యం అందించాలి
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతోన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఏపీలో కరోనా కేసులకు సంబంధించి 'ఏబీఎన్' న్యూస్ ఛానెల్లో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఊహించని విధంగా పెరుగుతున్నప్పటికీ ప్రజలకు భరోసా కల్పించడం లేదని ఆయన అన్నారు.
'నిన్న 9782 కేసులు, 86 మరణాలు. కొంతమంది ప్రజా ప్రతినిధులు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. సామాన్య, మధ్యతరగతి వారికికూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలి. 3,16,000 కేసులు, 3,000 మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ఎందుకు నిన్న కేబినెట్లో చర్చించి ప్రజలకు భరోసా కల్పించలేదు వైఎస్ జగన్?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.