తన తోబుట్టువులతో కలిసివున్న ఫొటోను పంచుకున్న కంగనా రనౌత్

  • ఈ ఫొటో 1998 నాటిదన్న కంగనా
  • నవంబరులో తన సోదరుల పెళ్లిళ్లు జరిగాయని వెల్లడి
  • ఈ క్షణాలను ఇన్ని సంవత్సరాలు ఎలా కోల్పోయామంటూ ట్వీట్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన సినిమాలతోనే కాకుండా, ఇటీవల తన పదునైన వ్యాఖ్యలతోనూ ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నేపథ్యంలో బాలీవుడ్ లో బంధుప్రీతి అంశాన్ని ఆమె తెరపైకి తెచ్చిన తీరు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. తాజాగా, కంగనా తన కుటుంబసభ్యులతో కలిసివున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మండి లోని తన తల్లిదండ్రుల నివాసంలో 1998లో తీసిన ఫొటో ఇదని వెల్లడించారు.

"ఈ ఫొటోలో నా పక్కనే నిల్చున్న నా తమ్ముళ్ల పేర్లు అక్షత్, కరణ్. ఇటీవలే నవంబరులో వాళ్ల పెళ్లిళ్లు జరిగాయి. అంత ఉద్విగ్న క్షణాలను మా కుటుంబంలో ఎప్పుడూ చూడలేదు. ఇన్ని సంవత్సరాలు ఈ క్షణాలను ఎలా కోల్పోయామో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది" అంటూ కంగనా ట్వీట్ చేశారు. కాగా, ఈ ఫొటోలో కంగనా అక్క రంగోలీ చందేల్ కూడా ఉన్నారు.


More Telugu News