ప్రమాదం నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
- శ్రీశైలంలో నేడు పూజలు నిర్వహించాల్సిన జగన్
- అక్కడి జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
- సాయం కావాలంటే అందించాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి శ్రీశైలం పర్యటన రద్దయింది. సాగునీటి అవసరాల కోసం నీటి తరలింపుతోపాటు ప్రాజెక్టు పరిస్థితులను సమీక్షించడం, పూజలు నిర్వహించడం కోసం జగన్ నేడు శ్రీశైలంలో పర్యటించాల్సి ఉంది. అయితే, అక్కడి జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా గత రాత్రి సంభవించిన ప్రమాదంలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని సీఎం జగన్ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పర్యటనను రద్దు చేసుకున్నారు. సహాయ కార్యక్రమాల కోసం ఏపీ నుంచి ఎటువంటి సాయం కావాలన్నా వెంటనే సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.