భూములను ఆక్రమించుకున్న ఈ సంస్థపై ఏ కేసులు పెట్టారో చెప్పండి: దేవినేని ఉమ

  • విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఓ బల్క్‌ డ్రగ్‌ కంపెనీ 
  • 108 ఎకరాలు ఆక్రమించిన ఫార్మా కంపెనీ 
  • దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు?
  • ప్రభుత్వం మారగానే చకచకా కదిలిన ఫైలు 
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన ఓ బల్క్‌ డ్రగ్‌ కంపెనీ భూ దందాలకు పాల్పడుతోందని, ఆ కంపెనీ వెనుక ఉన్న పెద్దలు ఎవరని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. 'విశాఖలో 108 ఎకరాలు ఆక్రమించిన ఫార్మా కంపెనీ వెనుక పెద్దలు ఎవరు? ప్రభుత్వం మారగానే చకచకా కదిలిన ఫైలు. భూములిచ్చేది లేదని 4 గ్రామాలంటున్నా ఎకరా 50 లక్షలు చేసే భూమిని 18 లక్షలకే అధికారులు ఎలా కేటాయిస్తారు? ప్రజావసరాలకు ఉపయోగించే భూములను ఆక్రమించుకున్న సంస్థపై ఏం కేసులు పెట్టారో చెప్పండి' అని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.

విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన (బల్క్‌ డ్రగ్‌ కంపెనీ) హెటెరో డ్రగ్స్‌  భూ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని సదరు పత్రికలో పేర్కొన్నారు.  200 ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థ అనంతరం 400 ఎకరాలకు విస్తరించిందని, మరో అడుగు వేస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులను ఆక్రమించుకుందని అందులో ఉంది.


More Telugu News