మళ్లీ స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- వరుసగా ఆరో రోజు ధరల్లో పెరుగుదల
- హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.84.94
- డీజిల్ ధర 80.17 రూపాయలు
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ధరల్లో దాదాపు 10 పైసల పెరుగుదల కనిపించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో యుఎస్ గల్ఫ్ తీరంలో వ్యాపారులు భారీగా ఉత్పత్తి కోతలు విధించిన నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు పెట్రోల్ ధర హైదరాబాద్‌లో 84.94 రూపాయలకు చేరగా, డీజిల్ ధర 80.17 రూపాయలకు చేరింది.
ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.81.73, డీజిల్ రూ.73.56, ముంబైలో పెట్రోల్ ధర రూ.88.39, డీజిల్ ధర రూ.80.11, చెన్నైలో పెట్రోల్ ధర రూ. 84.73, డీజిల్ ధర రూ.78.86, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.83.24, డీజిల్ ధర రూ.77.06, బెంగళూరులో పెట్రోలు 84.39 రూపాయలు ఉండగా, డీజిల్ 77.88 రూపాయలుగా ఉంది.