డాక్టర్ రమేశ్ బాబుపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించడంపై ఐఎంఏ అభ్యంతరం

  • పోలీసుల తీరు పట్ల ఐఎంఏ అభ్యంతరం
  • డాక్టర్ రమేశ్ కు నేర చరిత్ర లేదన్న ఐఎంఏ
  • డాక్టర్ల పట్ల పోలీసులు చులకనభావం వీడాలని హితవు
రమేశ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేశ్ బాబుపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరి సరికాదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డాక్టర్ రమేశ్ ఓ టెర్రరిస్టో, మావోయిస్టో కాదని, ఆయనకు నేర చరిత్ర లేదని, అలాంటప్పుడు పోలీస్ కమిషనర్ ఆయనపై లక్ష రూపాయల రివార్డు ఎలా ప్రకటిస్తారంటూ ఐఎంఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.

పోలీసుల చర్యలు వైద్యుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్లను చులకనగా చూడడాన్ని పోలీసులు మానుకోవాలని, అంతకుముందు డాక్టర్ సుధాకర్ విషయంలోనూ ఇలాగే ప్రవర్తించారని ఐఎంఏ ఆరోపించింది. కరోనాపై పోరాటంలో ముందు నిలిచి పోరాడుతున్నది డాక్టర్లేనన్న విషయం గుర్తెరగాలని పేర్కొంది.


More Telugu News