మైలవరం ప్రజా ప్రతినిధి దోపిడీ కనబడుతుందా?: దేవినేని ఉమ

  • ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసి విమర్శలు
  • కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ తవ్వకాలు
  • నేతల అండతో అక్రమాలు
  • రెవెన్యూ అధికారుల మౌనం
'రూ. కోట్లు కుమ్మేశారు' పేరిట ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఏపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ తవ్వకాలపై ఏ చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.  

'నేతల అండతో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ తవ్వకాలు.. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో అటవీ ప్రాంతంలో భారీగా తవ్వకాలు. వందల కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్, కంకర తరలింపు, ఇద్దరు అటవీశాఖ అధికారుల సస్పెన్షన్, 10 లక్షల రూపాయల జరిమానాతో సరి. రెవెన్యూ అధికారుల మౌనం. మైలవరం ప్రజా ప్రతినిధి దోపిడీ కనబడుతుందా? వైఎస్‌ జగన్‌' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.  కాగా, రెవెన్యూ, అటవీ, గనుల శాఖ మధ్య జరిగిన మూడు ముక్కలాట వల్ల అక్రమార్కులు ఆ సంపదను సులువుగా దోచుకోగలిగారని ఈనాడు పత్రికలో పేర్కొన్నారు.


More Telugu News